ఎక్స్ పోజింగే కాదు ఇంకా చాలా చేశాను!

0

నాగచైతన్య ‘సవ్యసాచి’ మరియు అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ తాజాగా రామ్ కు జోడీగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఈ అమ్మడి అందాల విందు చూడబోతున్నామని పోస్టర్లు మరియు ట్రైలర్ లు చూస్తుంటేనే అనిపిస్తుంది. పూరి ఇద్దరు హీరోయిన్స్ ను కూడా చాలా గ్లామర్ గా చూపించాడని మాస్ ఆడియన్స్కు ఇద్దరు హీరోయిన్స్ కూడా అందాల విందు ఖాయంగా కనిపిస్తుంది.

ఈ సమయంలోనే ఒక ట్విట్టర్ యూజర్ ‘ఎక్స్ పోజింగ్ కాకుండా ఇంకేమైనా చేశావా ఈ సినిమాలో’ అంటూ ప్రశ్నించాడు. అతడి ప్రశ్నకు తిక్క రేగిన నిధి అగర్వాల్ స్పందిస్తూ ‘చాలానే చేశాను.. ట్రైలర్ కాకుండా మూవీ చూడు’ సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది. ఈ చిత్రంపై నిధి అగర్వాల్ చాలా నమ్మకంగా ఉంది. తనకు ఇష్టమైన దర్శకుడు పూరి దర్శకత్వంలో చేసేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఆయన సినిమాలు ఎన్నో చూశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ చిత్రంను ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇందులో నిధి అగర్వాల్ తో పాటు మరో హీరోయిన్ గా నభా నటేష్ కూడా నటించింది. రామ్ డబుల్ దిమాక్ హైదరాబాదీ కుర్రాడిగా కనిపించబోతున్నాడు.
Please Read Disclaimer