అందాల ‘నిధి’ బయట పడ్డట్లుగా ఉంది

0

తెలుగు ప్రేక్షకులకు సవ్యసాచి.. మిస్టర్ మజ్ను చిత్రాలతో దగ్గరయిన అందాల నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కెరీర్ లో మొదటి సక్సెస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు మేనల్లుడు హీరోగా పరిచయం కాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పలు ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెన్షేషనల్ క్రియేట్ చేసేలా పోస్ట్ లు పెడుతోంది.

తాజాగా ఈ ఫొటోను షేర్ చేసిన నిధి అగర్వాల్ అందరి దృష్టిని తన వైపుకు మరల్చుకుంది. అందాల నిధి అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ గ్లామర్ షో కు నెటిజన్స్ ఫిదా అవుతూ లైక్స్ షేర్స్ తో ఈ ఫొటో ను ముంచెత్తారు. అందాల ప్రదర్శణ తో జనాల దృష్టిని ఆకర్షించాలని ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి.

ఈ విషయంలో చూపించే శ్రద్ద నటన మరియు సినిమాల ఎంపిక లో కూడా చూపిస్తే ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటావు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అందాల నిధి ఆరబోతకు మిశ్రమ స్పందన దక్కింది. మీరు ఈ ఫొటోను ఒక లుక్కేయండి.
Please Read Disclaimer