హాట్ చాకొలేట్ నిధి అగర్వాల్

0

నిధి అగర్వాల్ కొత్త తరం టాలీవుడ్ భామ. హిందీ సినిమాతోనే ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కానీ ఎక్కువ ఆలస్యం చేయకుండా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గ్యాప్ లేకుండా మూడు తెలుగు సినిమాలు చేసింది. మొదటి రెండు నిరాశపరిచినా ముచ్చటగా మూడో సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ తో సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా అటూ ఇటూ అయితే ఐరన్ లెగ్ ట్యాగ్ వచ్చి ఉండేదేమో కానీ సూపర్ హిట్ కావడంతో నిధికి డిమాండ్ పెరిగింది.

నిధి కెరీర్ విషయాలు ఇలా సాఫీగా సాగుతున్నాయి. వీటితోపాటుగా సోషల్ మీడియాలో దుమ్ము లేపుతూ అభిమానులను పెంచుకుంటూ ఈ జెనరేషన్ భామ అనిపిస్తోంది. ఇన్స్టాలో ఈ భామకు నాలుగు మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. దీన్ని బట్టి ఈ భామ స్పీడు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫాలోయర్లకోసం రెగ్యులర్ గా హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ వారిని మురిపిస్తూ ఉంటుంది. నిన్నరాత్రి అలానే ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘గుడ్ నైట్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో నైట్ గౌన్ తరహాలో ఉండే జీన్స్ షర్టు ధరించింది.. బటన్లు పెట్టుకోకుండా చొక్కాకే ఉన్న క్లాత్ బెల్టును కట్టుకుంది. ఈ వయ్యారానికి తోడు కిటికీలో ఓ సెక్సీ పోజులో కూర్చుంది. సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ తో ఇన్స్టా టెంపరేచర్లను కనీసం ఓ పది డిగ్రీలు పెంచేసింది.

ఈ ఫోటోకు నెటిజన్లు డంగైపోయారు. ‘ఇలాంటి ఫోటోతో గుడ్ నైటా.. మాకు నిద్ర ఎగిరిపోయింది’.. ‘బట్టలు ఉంటే చిరాకు అనుకుంటా పాపకి’.. ‘హాట్ చాకొలేట్’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఇక నిధి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీలో ‘మాస్క్’.. ‘ఇక్కా’ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer