హాటీ అంత డిమాండ్ చేసిందా?

0

దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. ఈ విషయంలో నవతరం కథానాయికలు అస్సలు తగ్గరు. అవకాశం అని వెంటపడితే చాలు చెట్టెక్కి కూచుంటారు. అయితే అసలు కెరీర్ లో వరుసగా రెండు ఫ్లాప్ సినిమాల్లో నటించి ఇటీవలే హిట్టు అందుకుంది బెంగళూరు భామ నిధి అగర్వాల్. అక్కినేని హీరోలు నాగచైతన్య- అఖిల్ సరసన తొలి రెండు చిత్రాలు చేసినా అవేవీ ఈ అమ్మడికి కలిసి రాలేదు. రీసెంట్ గానే రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. పూరి మార్క్ మాస్ మూవీగా ఇది ఫ్యాన్స్ కి చేరువైంది.

ఇక కెరీర్ లో తొలి హిట్టు అందుకున్న నిధికి తాజాగా డెబ్యూ హీరో అశోక్ గల్లా సరసన అవకాశం దక్కింది. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నిధి ట్యాలెంట్ ని దృష్టిలో పెట్టుకుని భారీ పారితోషికాన్ని ఇచ్చేందుకు సదరు నిర్మాతలు అంగీకరించారట. అందానికి అందం.. గ్లామర్ యాంగిల్ లో నిధిని కొట్టేవాళ్లే లేరు.

అందాల ఆరబోతకు చిట్టి పొట్టి నిక్కర్లలో హీటెక్కించేందుకు ఏమాత్రం మొహమాటం పడని ఈ అమ్మడు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. తనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా గల్లా బృందం పిలిచి మరీ ఈ ఛాన్స్ ఇచ్చారట. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లాని తల్లిదండ్రులు పద్మ గల్లా-జయదేవ్ గల్లా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేస్తున్నారు. ఆ మేరకు ఈ ఆదివారం హైదరాబాద్ లో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు భారీగా అతిధుల్ని ఆహ్వానించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా అటెండ్ కానున్నారట. ఇలాంటి క్రేజీ సినిమాలో నిధికి ఛాన్స్ దక్కడం అదృష్టమే. ఆమ్యామ్యా బాగానే గిట్టుబాటైందన్న మాట వేడెక్కిస్తోంది.
Please Read Disclaimer