ఛార్మింగ్ బ్యూటీతో చిల్లింగ్ బేబి

0

అక్కినేని నాయికగా ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఆరంభం ఊహించని షాక్ లు తిన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సరసన సవ్యసాచి అఖిల్ సరసన మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు ఊహించని విధంగా నెగెటివ్ రిజల్ట్ ని ఇచ్చాయి. ఫ్లాపులతో సంబంధం లేకుండా నిధిలోని స్పీడు కి పడిపోయిన పూరి జగన్నాథ్ ఛార్మి కౌర్ అండ్ టీమ్ తనకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నిధి అనూహ్యంగా ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా (ఇస్మార్ట్ శంకర్) షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ నుంచి ఛార్మింగ్ బ్యూటీ ఎప్పటికప్పుడు షూటింగ్ అప్ డేట్స్ ని అందిస్తూనే ఉన్నారు. షూటింగ్ ని ఎంతో ఎంజాయ్ చేస్తూ నడిపిస్తున్న తీరుపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇదిగో ఈ ఫోటో చూశాక మరింత క్లారిటీ వచ్చేసింది. లొకేషన్ లో పూరి కనెక్ట్స్ సీఈవో కం నిర్మాత హోదాలో ఛార్మి ఎంత సరదాగా జాలీగా టైమ్ స్పెండ్ చేస్తారో అర్థమవుతోంది. అలాగే ఆర్టిస్టులతో ఛార్మి కౌర్ క్లోజ్ నెస్ ఎలివేట్ అయ్యింది ఈ ఫోటోలో. ఆడుతు పాడుతు చేస్తుంటే… అలుపు సొలుపేమున్నది? అన్న క్లాసిక్ మెలోడీని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే. ఛార్మింగ్ బ్యూటీతో గోవా షూటింగ్ లో బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ చిల్లింగ్ మూవ్ మెంట్ ప్రత్యేకంగా యువతరం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోని ఛార్మి స్వయంగా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. వాళ్లు నటిస్తుంటే మేం చూస్తాం! అంటూ కామెంట్ ని పోస్ట్ చేశారు.

ఈ ఫోటోకి నెటిజనుల స్పందన అంతే గమ్మత్తుగా ఉంది. ఇద్దరు ప్రెట్టీ డాళ్స్ అమేజింగ్! అంటూ ఓ అభిమాని స్పందించాడు. నిధి కళ్లలో మెరుపులు వేరొకరిలో చూడలేం అంటూ వేరొక వీరాభిమాని కామెంట్ ని పోస్ట్ చేశాడు. `వెరీ వెరీ లవ్ లీ బెస్ట్ క్వీన్స్ అని కిల్లింగ్ బ్యూటీస్ అని కొందరు అభిమానులు వ్యాఖ్యానించడం ఆసక్తికరం. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి త్వరలో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అందుకు తగ్గట్టే పక్కా ప్రణాళికతో ఛార్మి అండ్ టీమ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరోవైపు పూరి కనెక్ట్స్ లోనే ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer