నటిగా కలతీరింది.. కానీ ‘కెరీర్’లో లైఫే లేదు

0

సినీ ఇండస్ట్రీలో కొందరు అదృష్టం కొద్ది హీరోయిన్ అవుతారు. మరికొందరేమో ముందే అనుకొని హీరోయిన్ అవుతారు. ఇంకొందరేమో ఎక్స్పెక్ట్ చేయకుండానే హీరోయిన్ అవుతారు. ఇందులో రెండో కోవకు చెందిందే నిధి అగర్వాల్. అంటే ఈ అమ్మడు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ ఉంది. మోడలింగ్ లో రాణించి సినిమా అవకాశాలు చేజిక్కించుకుంది. మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ వెంటనే దక్షిణం వైపు మళ్ళింది. కానీ కొందరు హీరోయిన్లకి పట్టుదల పరువాలతో పాటు అదృష్టం కూడా కొంత కావాల్సి ఉంటుంది. నిధి విషయంలో మాత్రం అదృష్టం ఆవగింజంత కూడా లేదు. ఎందుకంటే నిధి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఆమెకు కాస్త గుర్తింపు కూడా తీసుకు రాలేకపోయాయి. ప్రస్తుతం అమ్మడు గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది.

ఇక తాజాగా మడుగు తను సినిమాల్లోకి ఎలా రావాలి అనుకుందో ఆ విషయాలను బయటపెట్టింది. ‘చిన్నప్పుడు మొదటిసారి సినిమా చూసినప్పుడు నాకెంతో ఆనందంగా అనిపించింది. ఆ సమయంలోనే నటి కావాలని ఫిక్స్ అయ్యాను. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఏం చేయాలో అవగాహన కూడా నాకు లేదు. సినీ పరిశ్రమలో తెలిసిన వాళ్లు కూడా లేరు. కాకపోతే ఆ కలను సాకారం చేసుకునేందుకు మోడలింగ్లోకి అడుగుపెట్టాను. అనుకున్నట్లుగానే హీరోయిన్ అయి హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది”. కానీ అమ్మడి కెరీర్ చూస్తే మాత్రం బాగా వెనకబడి ఉందని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది. కానీ పేరు మాత్రం నభా నటేష్ కి దక్కింది. కేవలం అందాల ఆరబోతనే నమ్ముకున్న నిధి.. కొన్ని నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తే కెరీర్ కాస్త మెరుగ్గా ఉంటుందని నెటిజన్లు అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer