న్యూ జర్నీ గురించి స్పందించిన మెగా డాటర్…?

0

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనకు పెళ్లి కుదిరిందని నిహారిక సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. ఇక కాబోయే భర్త ఫొటో రివీల్ చేయడంతో నిన్నటి నుండి సోషల్ మీడియాలో వీరి ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. జంట చూడముచ్చటగా ఉందంటూ మెగా అభిమానులు సినీ ప్రముఖులు ఆమెకు విషెస్ చెప్తూ వస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యని మెగా డాటర్ నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. ఆగష్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ జరిపి వచ్చే ఏడాది సుముహూర్తం చూసి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు ఆలోచిస్తున్నాయట.

కాగా నిహారిక కొణిదల లేటెస్టుగా ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి పలు విషయాలు షేర్ చేసుకుందట. తాను జీవితాంతం గడపాలని కోరుకునే వ్యక్తిని కలుసుకున్నందుకు తాను థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాని చెప్పిందట. వండర్ ఫుల్ న్యూ జర్నీ స్టార్ట్ చేయడానికి సమయం వచ్చిందని భావిస్తున్నాని చెప్పుకొచ్చిందట. ఇదిలా ఉండగా నిహారిక మరియు చైతన్య ఫ్యామీలీస్ ఈ మధ్యే వీరి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చారట. అయితే పెళ్లి నిర్ణయాన్ని రెండు కుటుంబాలు నిహారిక – చైతన్యలకే వదిలేశారని తెలుస్తోంది. వీరిద్దరూ రెండు మూడుసార్లు కలిసి ఒకరినొకకరు తెలుసుకుని పెళ్లికి ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Please Read Disclaimer