మోక్షజ్ఞ తో ఫోటోలు.. నిహారిక స్పందన ఇదే

0

మెగా డాటర్ నిహారిక తన తాజా చిత్రం ‘సూర్యకాంతం’ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రణీత్ బి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నిహారికకు ఒక ప్రశ్న ఎదురైంది. కొంతకాలం క్రితం నిహారిక తో పాటు నందమూరి బాలకృష్ణ తనయడు మోక్షజ్ఞ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

సరిగ్గా ఇదే విషయంపై ప్రశ్న ఎదురు కాగా నిహారిక ఇలా స్పందించింది. ‘డిగ్రీ కాలేజిలో చదివే సమయంలో మోక్షజ్ఞ నాకు జూనియర్. అప్పుడు పరిచయం. ఆ ఫోటోలు అప్పట్లో దిగినవే. ఇపుడు మోక్షజ్ఞ ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు’ అని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు బాలయ్య ఎవరో తెలియదని నాగబాబు వ్యాఖ్యానించిన సమయంలో నిహారిక.. మోక్షజ్ఞ ఉన్న ఫోటోలను కొందరు నెటిజనులు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్యపై యూట్యూబ్ వీడియోల ద్వారా కౌంటర్లు ఇస్తూ నాగబాబు వ్యాఖ్యలు చేయడం గురించి ప్రస్తావిస్తే.. ‘మా నాన్న చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతం’ అని సింపుల్ గా తేల్చేసింది.

‘సూర్యకాంతం’ మార్చ్ 29 న రిలీజ్ అవుతోంది. నిహారిక ఇప్పటివరకూ రెండు సినిమాలు చేసింది. కానీ ఆ రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. మరి ముచ్చటగా ఈ మూడో సినిమా అయినా విజయం సాధిస్తుందేమో వేచి చూడాలి. బాక్స్ ఆఫీస్ వద్ద అసలు పోటీ అంటూ లేకపోవడం మాత్రం ‘సూర్యకాంతం’ చిత్రానికి కలిసి వచ్చే అంశమే.
Please Read Disclaimer