ఈ రీమేక్ అయినా వర్కౌట్ అవుద్దా?

0

సాదరంగా తెలుగులో రీమేక్ సినిమాలు సక్సెస్ రేట్ తక్కువే. ఈ జెనరేషన్ లో తెలుగులో హైట్టైన రీమేక్ సినిమాలు వేళ్ళ మీద లెక్కేయొచ్చు. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ ‘గద్దల కొండ గణేష్’ రీమేక్ సినిమాతో మంచి వసూళ్ళు సాధించాడు.

అయితే ఇప్పుడు కుర్ర హీరో నిఖిల్ రీమేక్ తో వస్తున్నాడు. మొన్నీ మధ్య కన్నడలో సూపర్ హైట్టైన కిరిక్ పార్టీను ‘కిర్రాక్ పార్టీ’ పేరుతో తెలుగులో రీమేక్ చేసాడు నిఖిల్. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. కొన్ని మార్పులు చేయడం వల్లనే కంటెంట్ సరిగ్గా చెప్పలేకపోవడం వల్లనో సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు.

అయితే మళ్లీ తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘కనిథన్’ ను తెలుగులో అర్జున్ సురవరం అంటూ రీమేక్ చేసాడు. ఈ రీమేక్ తో హిట్ కొట్టడం నిఖిల్ కి చాలా ముఖ్యం. అందుకే లోపల భయం ఉన్నా సినిమా కంటెంట్ ను నమ్ముకొని ఈ సారి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. లేటెస్ట్ గా ఇక ఇది లాస్ట్ రీమేక్ అని కూడా అన్నాడు నిఖిల్. మరి కుర్ర హీరోకి ఈ రీమేక్ అయినా హిట్ ఇస్తుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
Please Read Disclaimer