ఈసారి రావడం ఖాయమే అనిపిస్తుంది

0

నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. సినిమా సెట్స్ పై ఉన్న సమయంలోనే అంచనాలు భారీగా పెరిగి పోయాయి. నిఖిల్ ఒక జర్నలిస్ట్ గా కనిపించబోతున్నట్లుగా మొదటే ప్రకటించారు. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు అంచనాలు పెంచాయి. కాని సినిమా విడుదల విషయంలో కొన్ని ఇబ్బందుల కారణంగా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఎట్టకేలకు సినిమాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మళ్లీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం విడుదల విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు లీక్స్ ఇస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా సినిమా విడుదల అవుతుందనేలా వారు ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్నారు.

తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న గణిదన్ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో అధర్వ మరియు కేథరిన్ తెర్సా జంటగా నటించగా తెలుగులో నిఖిల్ మరియు లావణ్య త్రిపాఠిలు హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇక తమిళ వర్షన్ కు డైరెక్ట్ చేసిన టి ఎస్ సంతోష్ తెలుగులో కూడా డైరెక్ట్ చేశాడు. ఠాగూర్ మధు నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు రాబోతున్న నేపద్యంలో నిఖిల్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
Please Read Disclaimer