పెద్దన్న సినిమా తర్వాతే అంటున్న నిఖిల్!

0

మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోలలో నిఖిల్ ఒకరు. అయితే ఎంత డిఫరెంట్ గా ట్రై చేసినా సినిమా రిలీజులు మాత్రం ఒక్కోసారి హీరోల చేతిలో ఉండవు. నిఖిల్ కొత్త సినిమా ‘అర్జున్ సురవరం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు కూడా రిలీజ్ పై క్లారిటీ లేదు. దీంతో ఒక అభిమాని ఇదే విషయాన్ని నిఖిల్ ను డైరెక్ట్ గా అడిగాడు.

ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫ్యాన్ “అన్నా నీ మూవీ కిరాక్ పార్టీ విడుదలై 16 నెలలు అయిందన్నా.. వెయిటింగ్ ఫర్ అర్జున్ సురవరం” అంటూ నిఖిల్ ఖాతాను టాగ్ చేశాడు. ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ “ఆ నిరీక్షణ వృధా కాదు.. వర్త్ వెయిటింగ్.. పెద్దన్న ప్రభాస్ సాహో రిలీజ్ అయిన తర్వాత” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నిఖిల్ తన సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసినట్టే. ‘సాహో’ ఆగష్టు 30 న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత అంటే ఒక నెల గ్యాప్ ఇచ్చినా అక్టోబర్ లోనే ఈ సినిమా రిలీజ్ ఉండే అవకాశం ఉంది.

తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కనిదన్’ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధునిర్మిస్తున్నారు.
Please Read Disclaimer