ఆమెను కాస్త ప్రశాంతంగా ఉండనీవ్వండి ప్లీజ్

0

కన్నడ హీరో నిఖిల్ గౌడ రాజకీయంగా మరియు సినీ కెరీర్ పరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. మరో వైపు ఎంపీగా పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. ఇలాంటి సమయంలో నిఖిల్ కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిశ్చయించారు. కొన్ని రోజుల క్రితం వివాహ నిశ్చితార్థం కూడా అయ్యింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వీరి వివాహం గురించి రక రకాలు గా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కొందరు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం కాకపోవడంతో అసలు పెళ్లి ఉందా లేదా అంటూ ప్రశ్నిస్తుండగా మరికొందరు మాత్రం అదుగో పెళ్లి.. ఇదుగో తేదీ అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. మీడియా లో రకరకాల వార్తలు ప్రస్తుతం నిఖిల్ పెళ్లి గురించి వస్తున్నాయి. దాంతో నిఖిల్ కాస్త సీరియస్ అయ్యాడు.

ఇటీవల నిఖిల్ స్పందిస్తూ.. నా పెళ్లి తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఆ తేదీ నిర్ణయించిన వెంటనే మీడియాకు తెలియజేస్తాను. ఆ అమ్మాయిని మా తల్లిదండ్రులు ఎంపిక చేశారు. ఆమెతో ఇప్పటి వరకు నేను పూర్తిగా ఇంట్రాక్షన్ కూడా కాలేదు. మీమిద్దరం ప్రస్తుతం ఒకరిని ఒకరం అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయం లో ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం.. పుకార్లు పుట్టించడం వల్ల ఆమెకు ప్రశాంతత లేకుండా అయ్యింది. నాకు ఇవన్నీ అలవాటే.. కాని ఆమెను దయచేసి ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ నిఖిల్ గౌడ కోరాడు.
Please Read Disclaimer