‘రైడర్’ గా వస్తున్న నిఖిల్…!

0

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు యువరాజా నిఖిల్ కుమార్ గౌడ ‘జాగ్వార్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో తెలుగు కన్నడ భాషలలో ఈ సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. దీంతో కన్నడ సినిమాలపైనే దృష్టి పెట్టిన నిఖిల్ కుమార్.. ‘సీతారామ కల్యాణ’ ‘కురుక్షేత్ర’ వంటి సినిమాల్లో నటించాడు. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.

కాగా నిఖిల్ కుమార్ హీరోగా ‘రైడర్’ అనే ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్స్ తీసిన విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘రైడర్’ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే నిఖిల్ కుమార్ మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చంద్రు మనోహర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాశ్మీరా పార్దేషి హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తున్నారు. మరి తెలుగులో రెండోసారి స్ట్రయిట్ తెలుగు సినిమాతో వస్తున్న కన్నడ హీరోకి ఎలాంటి రిజల్ట్ దక్కనుందో చూడాలి.