Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రతి కార్తీక మాసం కార్తికేయ ఆలయంలో 365 దీపాలు వెలిగించే హీరో

ప్రతి కార్తీక మాసం కార్తికేయ ఆలయంలో 365 దీపాలు వెలిగించే హీరో


కార్తీక మాసం ఆద్యంతం శివభక్తులే గాక సామాన్య పౌరులు ఎంతో నిష్ఠగా శివుని ఆరాధిస్తుంటారు. సామాన్యుడు సెలబ్రిటీ అనే విభేధం లేదు. ప్రతి ఒక్కరూ శివారాధనతో తరిస్తుంటారు. ఇక ఈ మాసం అంతా సికిందరాబాద్ లార్డ్ కార్తికేయ స్కందగిరి ఆలయంలో నిత్యదీపారాధన సాగుతుంటుంది.

నేడు కార్తీక సోమవారం సందర్భంగా నిఖిల్ స్కందగిరి ఆలయానికి వెళ్లారు. అక్కడ 365 ద్వీపాల్ని వెలిగించి కార్తికేయుని ఆరాధించాడు. కార్తికా పౌర్ణమి పవిత్రమైన నెల కాబట్టి మహిళలు పురుషులు అనే భేధం లేకుండా పూజలు ఆచరిస్తున్నారు. అందరితో కలిసిపోయి నిఖిల్ దీపారాధన చేయడం ఆసక్తికరం.

ఈ నెలలో ఈ ఆలయానికి భారీగా రష్ ఉంటుంది. అయినా ప్రతి సంవత్సరం నిఖిల్ సిద్ధార్థ్ ఈ ఆలయానికి 365 దీపాలను వెలిగించటానికి వెళుతున్నారు. ఇది అతడి సాంప్రదాయం.

సంవత్సరంలో 365 రోజులకు సరిపడా 365 ద్వీపాలను వెలిగించడం ఆచారం. నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ జోడీ సీక్వెల్ పనిలో ఉన్నారు. సోలో హీరోగా నిఖిల్ కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన కార్తికేయ మూవీ అంటే అతడికి ఎంతో ప్రత్యేకం.

కార్తికేయ 2 తో మరో సంచలన విజయం దక్కాలని శివకార్తికేయులను ప్రార్థించాడన్నమాట. ‘కార్తికేయ’ అభిమానులు సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్ట్ 1 ను మించి థ్రిల్ చేసే ఆసక్తికర కథనంతో చందూ ఈ సినిమాని రూపొందిస్తారనే ఆశిస్తున్నారు.