నిఖిల్ చేతిలో మూడు సినిమాలు

0

కెరీర్ లో ఎవరికైనా ఓ వరెస్ట్ ఫేజ్ అంటూ ఉంటుంది. ప్రస్తుతం మొన్నటి వరకూ అలాంటి ఫేజ్ నే ఫేస్ చేసాడు హీరో నిఖిల్. ఒకే ఒక్క సినిమా కుర్ర హీరోతో ఎక్కడ లేని భయం పుట్టించింది. షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలోనే టైటిల్ వివాదం ఆ తర్వాత రిలీజ్ ప్రాబ్లమ్స్ ఇలా వరుసగా నిఖిల్ సినిమాకు అన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే వాటన్నిటికి ఎదురు నిలిచి ఎట్టకేలకు రేపే అర్జున్ సురవరం తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నిఖిల్.

నిన్నటి వరకూ నిఖిల్ పెద్దగా సినిమాలు లేవని ‘కార్తికేయ 2’ కూడా ఇప్పుడే ఉండదనే వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఈ ప్రశ్నలకు తాజా ఇంటర్వ్యూలో జవాబిచ్చాడు నిఖిల్. ‘కార్తికేయ2’ తో పాటు మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ చేసినట్టు తెలిపాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఉంటుందని మరొకటి ‘హనుమాన్’ అనే ఫాంటసీ సినిమా అని చెప్పుకున్నాడు.

అయితే ‘హనుమాన్’ అనే సినిమాకు ఇంకా దర్శకుడెవరనేది ఫైనల్ అవ్వలేదని అన్నాడు. ఇక ‘శ్వాస’ సినిమా ఆగిపోవడంపై గురించి కూడా స్పందించాడు. ముందు తనకు చెప్పిన కథ ఒకటని ఆ తర్వాత మరో వర్షన్ చెప్పారని అందుకే ఆ సినిమా చేయలేనని చెప్పి బయటికి వచ్చేశానని అయితే అదే బ్యానర్ లో ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంటుందని తెలిపాడు.
Please Read Disclaimer