నిఖిల్.. లైన్లో మూడు నాలుగు ప్రాజెక్టులు ?

0

ఎక్కువ గ్యాప్ తీసుకుండా వరసగా సినిమాలు చేసే హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. అయితే ఈసారి మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. నిఖిల్ లాస్ట్ సినిమా ‘కిరాక్ పార్టీ’ పోయినేడాది మార్చిలో రిలీజ్ అయింది. ఆ తర్వాత ‘అర్జున్ సురవరం’ షూటింగ్ పూర్తి చేసినా ఇంకా రిలీజ్ కాలేదు. మరోవైపు నిఖిల్ తన కొత్త సినిమాను కూడా మొదలుపెట్టలేదు. మరి ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి ఏంటి?

ప్రస్తుతం నిఖిల్ దగ్గర మూడు నాలుగు స్క్రిప్ట్ ను రెడీగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. వీటిలో ఏ సబ్జెక్ట్ కు నిఖిల్ ఓకే చెప్పినా ఆ సినిమాలకు నిర్మాతలు రెడీగా ఉన్నారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలీదు కానీ చందూ మొండేటి మాత్రం ‘కార్తికేయ-2’ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడట. స్క్రిప్ట్ బాగా వస్తోందని ఈ సినిమా వెంటనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

నిఖిల్ – చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కార్తికేయ’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలవడమే కాకుండా అటు చందు మొండేటికి.. ఇటు నిఖిల్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో మొదటి నుంచి భారీ అంచనాలు ఉంటాయి. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
Please Read Disclaimer