నెపోటిజంపై నిఖిల్ ఘాటు వ్యాఖ్యలు

0

బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ బలవన్మరణం అన్ని పరిశ్రమల్లోనూ హాట్ డిబేట్ గా మారింది. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అన్నిచోట్లా ఇదే చర్చ. ముఖ్యంగా హిందీ చిత్రసీమలో ప్రబలంగా ఉన్న నటవారసత్వం(నెపోటిజం).. మాఫియా సామ్రాజ్యంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నటవారసులు ఎదిగేందుకు బయటి ట్యాలెంటును తొక్కేయడం అక్కడ సహజమేనన్న చర్చా విస్త్రతంగా సాగింది.అయితే ఇలాంటి పరిస్థితే టాలీవుడ్ లో నిఖిల్ కి ఎదురైందా? అంటే అతడి వెర్షన్ ఆసక్తిని రేకెత్తించింది. తెలుగు సినీపరిశ్రమలో తనకు నెపోటిజం సమస్య ఎదురు కాలేదని నిఖిల్ అభిప్రాయపడ్డారు. అతడు నటించిన అర్జున్ సురవరం టీవీ లో టెలీకాస్ట్ అయిన సందర్భంగా సోషల్ మీడియాల్లో చిట్ చాట్ చేస్తూ పై విధంగా స్పందించాడు. ఇక్కడ తనకు అందరూ అవకాశాలిచ్చి ప్రోత్సహించారని నిఖిల్ తెలిపారు.కేవలం సినీపరిశ్రమలో మాత్రమే కాదు.. అన్ని పరిశ్రమల్లోనూ నటవారసత్వం పోటీ అనేవి ఉంటాయి. అన్నిచోట్లా తొక్కేయలని చూస్తారు. కానీ ఎదిగేందుకు ఎత్తుగడలతో ముందుకు సాగాలని ప్రతిభను చూపించి ఎదగాలని నిఖిల్ సూచించారు. మనం ధైర్యంతో ప్రతిభని నమ్ముకుని నిలబడాలన్నారు నిఖిల్. విజయం సాధించాలనే ప్రయత్నాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరేమన్నా వదిలేయకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సుశాంత్ సింగ్ మరణం తనని తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ-2 సహా గీతా ఆర్ట్స్ లో 18 పేజెస్ చిత్రంలోనూ నిఖిల్ నటిస్తున్నారు.
Please Read Disclaimer