నిఖిల్ ఇంకా ఎందుకీ డైలమా?

0

ఎక్కడికి పోతావు చిన్నవాడా? కేశవ చిత్రాలతో విజయాలు అందుకున్నాడు నిఖిల్. కిరాక్ పార్టీ ఫ్లాపైనా తనకు వచ్చిన నష్టమేమీ లేదు. అయితే ఆ తర్వాత `అర్జున్ సురవరం` రిలీజ్ డైలమా ఈ యంగ్ హీరోని చికాకు పెడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో దూకుడు మీదున్న హీరోగా నిఖిల్ పేరు మార్మోగింది. ఇలాంటి టైమ్ లో ఇంత గ్యాప్ రావడం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. తొలుత టైటిల్ సమస్య ఇబ్బందికి గురి చేసింది. ఆ తర్వాత టైటిల్ ని `అర్జున్ సురవరం`గా మార్చాక రకరకాల కారణాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. వాయిదా పడిన ప్రతిసారీ నిఖిల్ ఎమోషనల్ గానే స్పందించారు.

అయితే ప్రభాస్ `సాహో` వాయిదా పడ్డాక నిఖిల్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు వేచి చూశారు. సాహో వాయిదా అనగానే ఆగస్టు 15 బరిలో ఇద్దరు ముగ్గురు రెడీ అయ్యారు. శర్వానంద్-రణరంగం.. అడివి శేష్ -ఎవరు సినిమాల రిలీజ్ లను కన్ఫామ్ చేశారు. పలువురు ఇదే తేదీకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే నిఖిల్ వైపు నుంచి సౌండ్ వినిపించ లేదు. సాహో రిలీజ్ ఆగస్టు 30న ఉంటుంది కాబట్టి ఆ తర్వాత అయినా `అర్జున్ సురవరం` రిలీజ్ ఉంటుందా? అంటూ అభిమానుల్లో ముచ్చట సాగుతోంది.

మరోవైపు ఈ సినిమా గురించి రకరకాలుగా ప్రచారం సాగుతోంది. కొన్ని ఆర్థిక పరమైన చిక్కుల వల్ల రిలీజ్ కావడం లేదని .. లేదు ఎడిటింగ్ పూర్తవ్వలేదని మరికొందరు చెబుతున్నారు. కొన్ని సీన్లు అదనంగా జత చేయాల్సి రావడంతోనే ఈ ఆలస్యం అంటూ రకరకాలుగా ఫిలింనగర్ లో ముచ్చటించుకుంటున్నారు. కారణం ఏదైనా నిఖిల్ లాంటి రైజింగ్ హీరోకి ఈ గ్యాప్ అంత మంచిది కాదన్న వాదన అభిమానుల్లో ఉంది. `అర్జున్ సురవరం` తర్వాత ఎప్పటికి కొత్త సినిమా ప్రారంభిస్తాడు? అన్న ముచ్చటా సాగుతోంది.
Please Read Disclaimer