రిలీజ్ ఎప్పుడు నిఖిల్?

0

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కి ఎప్పుడూ ఎదురుకాని రిలీజ్ సమస్య ఎదురైంది. తమిళ్ లో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి మంచి విజయం సాధించిన ‘కనిధన్’ ను తెలుగులో రీమేక్ చేసాడు నిఖిల్. షూటింగ్ దశలో ఉండగానే ‘ముద్ర’ అనే పెట్టుకున్నారు. మరో నెలలో రిలీజ్ అనగా ఆ టైటిల్ తో ఇంకో సినిమా వచ్చింది. ఆ టైంలో నిఖిల్ ఆ సినిమా నిర్మాతపై సోషల్ మీడియం ద్వారా ఫైర్ అయ్యాడు. తన టైటిల్ తో సినిమా ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించాడు. కొన్ని రోజుల తర్వాత కామ్ గా ఆ టైటిల్ కి బదులు ‘అర్జున్ సురవరం’ అనే టైటిల్ పెట్టుకున్నాడు.

అక్కడి నుండి ఈ సినిమాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఏ ముహూర్తాన్న ఈ టైటిల్ పెట్టారో అప్పటి నుండి సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. ముందుగా మేలో రిలీజ్ డేట్ ఇచ్చారు. ఆ తర్వాత జూన్ కి వచ్చారు. మళ్లీ పోస్ట్ ఫోన్ చేశారు. ఇక అంతే అప్పటి నుండి ఇంత వరకూ రిలీజ్ డేట్ అన్నది రాలేదు. మొన్నటి వరకూ అసలు సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా అనే చర్చ సాగింది. నిఖిల్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ డేట్ తెలియక సినిమాపై ఆశలొదిలేసుకున్నారు. అసలు సినిమా రిలీజ్ కి సమస్యేంటనేది బయటికి కూడా తెలియట్లేదు.

ప్రస్తుతం ఆ సినిమాను పక్కన పెట్టి ‘కార్తికేయ 2’ పై ఫోకస్ పెట్టాడు నిఖిల్. ఒక్కసారిగా కార్తికేయ 2 సినిమా న్యూస్ లోకి వచ్చే సరికి ఇప్పుడు మళ్లీ అందరి చూపు ‘అర్జున్ సువరవం’ సినిమాపై పడింది. అసలు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా..? అనే సందేహం మొదలైంది. ఇక నిఖిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే దాకా ఈ డిస్కర్షన్ కంటిన్యూ అవుతుంది. ఏదేమైనా నిఖిల్ ఒక సినిమాకు సంబంధించి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఇదే మొదటి సారి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
Please Read Disclaimer