బిజినెస్ బాగా జరిగినా ఆ హీరోకి 50 శాతమే రెమ్యునరేషన్!

0

సినిమా బిజినెస్ బాగా జరిగినప్పుడు హీరోకి రావాల్సిన రెమ్యునరేషన్ గురించి ఆలోచించాల్సి ఉంటుందా? ముందు ఎవరి డబ్బులు వచ్చినా రాకున్నా.. హీరోకి మాత్రం పేముంట్ అందేస్తుందనుకుంటాం. కానీ.. తన విషయంలో మాత్రం అలా జరగలేదని వాపోతున్నాడు హీరో నిఖిల్. లావణ్యా త్రిపాఠితో జత కట్టిన ఆయన తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ రోజే ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

ఠాగూర్ మధు – రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి మేలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. ఇష్యూ వచ్చి విడుదల ఆగింది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు నిఖిల్. సినిమా బిజినెస్ బాగా జరిగినా.. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మాత్రం రాలేదన్నారు. కేవలం 50 శాతం రెమ్యునరేషన్ మాత్రమే తాను తీసుకున్నట్లు చెప్పారు.

నిర్మాతలకు థియేటర్స్ ఓనర్స్ కు మధ్య ఉన్న వారు తమ సినిమాను వాడేశారని.. ఆ విషయంలో తాను.. నిర్మాతలు ఏమీ చేయలేకపోయినట్లుగా చెప్పారు. ఇష్యూస్ ను క్లియర్ చేసేందుకు టైం తీసుకుందని.. అదే సినిమా లేట్ గా రిలీజ్ కావటానికి కారణమని చెప్పారు. తానిప్పటివరకూ 17 సినిమాల్లో నటించినా.. రిలీజ్ విషయంలో ఎప్పుడూ ఇబ్బందులు రాలేదన్నారు.

కొందరి కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం కావటంతో తనకు చాలా భయమేసిందన్నారు. ఇంటికెళ్లి ఏడ్చానని.. ఎన్నో నిద్ర లేని రాత్రుల్ని గడిపినట్లుగా పేర్కొన్నారు. తాజా చిత్రానికి లాభాలు వస్తే నిర్మాతలే తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇస్తారని చెప్పిన నిఖిల్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Please Read Disclaimer