రానాతో మల్టీ స్టారర్ మిస్సయిన కుర్ర హీరో

0

ప్రస్తుతం కొందరు యంగ్ హీరోలు సీనియర్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ అభిమాన హీరో కూడా మరో హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కి కోరిక కలగడం సహజమే. తాజాగా హీరో నిఖిల్ ను అదే అడిగాడు ఓ అభిమాని.

నిఖిల్ కి “మీ నుంచి మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు ఊహించొచ్చు” అనే ప్రశ్న వేసాడు. అయితే దీనికి సింపుల్ గా ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్. మంచి కథ దొరికినప్పుడు మల్టీ స్టారర్ చేయడానికి రెడీగానే ఉన్నానంటూ చెప్పుకున్నాడు.

ఇటివలే రానాతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాల్సిందని కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా కుదరర్లేదని తెలిపాడు. ఇక ఎట్టకేలకు ‘అర్జున్ సురవరం’తో ఈ నెలాఖరున థియేటర్స్ లోకి రాబోతున్న నిఖిల్ కాసేపు ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఇదే కార్యక్రమంలో ‘కార్తికేయ 2’ షూటింగ్ డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పాడు.
Please Read Disclaimer