కుర్ర హీరోను చాలా మంది మోసం చేశారట

0

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది కుర్ర హీరోల్లో నిఖిల్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన చేసిన సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. త్వరలో ఈయన అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక టాక్ షో లో ఈయన పాల్గొన్నాడు. అందులో పలు విషయాల గురించి మాట్లాడాడు.

నిఖిల్ మొదటి సినిమా ‘హ్యాపీడేస్’ ఆఫర్ గురించి మాట్లాడుతూ.. హ్యాపీడేస్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారంటే వెళ్లాను. చాలా మంది ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఎన్ని రోజులు ఎదురు చూసినా కూడా నాకు కాల్ రాలేదు. దాంతో నాకున్న పరిచయాలతో శేఖర్ కమ్ముల గారిని కలిశాను. ఆయన నన్ను చూసి ఛాన్స్ ఇచ్చారు. ఒకవేళ నేను ఆయన్ను నేరుగా కలవకుంటే అవకాశం వచ్చి ఉండేది కాదేమో అన్నాడు.

హ్యాపీ డేస్ సినిమాతో గుర్తింపు రావడంతో నన్ను చాలా మంది సినిమా చేద్దాం అంటూ కలిశారు. ఆ సమయంలో నాకు పెద్దగా అవగాహణ లేక పోవడంతో పదిలక్షలు పట్టుకుని వచ్చిన వారికి కూడా ఓకే చెప్పేవాడిని. పదిలక్షలు చేతపట్టుకుని వచ్చి కొన్ని రోజులు సినిమా చేస్తున్నట్లుగా హడావుడి చేసి సినిమాను వదిలేసేవారు. అలా చాలా సార్లు మోసపోయానంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో కొన్ని సమస్యలు అందరికి వస్తాయని నిఖిల్ అన్నాడు.
Please Read Disclaimer