నేను మా డైరెక్టర్ చాలా సార్లు కొట్టుకున్నాం

0

ఏ సినిమాల షూటింగ్స్ అప్పుడప్పుడు హీరోకి డైరెక్టర్ కి చిన్న చిన్న గొడవలు కామనే. కానీ అవి ఎక్కువగా బయటికి రావు. ఆ సినిమా హీరోనో దర్శకుడో ప్రెస్ మీట్ లో తెలిపే వరకూ ఆ విషయాలు ఎవరికీ తెలియవు.

లేటెస్ట్ గా నిఖిల్ ప్రెస్ మీట్ లో తన దర్శకుడితో డిస్కర్షన్స్ లో భాగంగా గొడవలు జరిగాయని అన్నాడు. నేను మా డైరెక్టర్ చాలా సార్లు కొట్టుకున్నాం అనే లైన్ కూడా వాడాడు. అయితే దర్శకుడు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టించారని తెలిపాడు. ఇక ఒక్కో సందర్భంలో ఆయనలో రాక్షసుడు కనిపించాడని అన్నాడు. ఫైనల్ గా బహిరంగంగా చెప్తున్నా సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడికే చెల్లుతుంది అన్నాడు.

ఇదే వేదికపై ప్రియాంక ఇన్సిడెంట్ గురించి కూడా స్పందించాడు నిఖిల్. చాలా ఘోరమైన సంఘటన అని ప్రియాంక పై అఘాయిత్యం చేసిన వారికి డెత్ పెనాల్టీ ఒక్కటే ఇవ్వాల్సిన పనిష్మెంట్ అన్నాడు. ఇక ఆ పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా ప్రధాని మోడీ ను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేసాడు నిఖిల్.
Please Read Disclaimer