గీతా కాంపౌడ్ లోకి యంగ్ హీరో

0

యంగ్ హీరో నిఖిల్ ఎట్టకేలకు తన అర్జున్ సురవరం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. వచ్చే వారంలో విడుదల కాబోతున్న అర్జున్ సురవరంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తన సినీ కెరీర్ లో ఈ సినిమా కోసం అత్యధికంగా కష్టపడ్డట్లుగా నిఖిల్ చెబుతున్నాడు. ఫిజికల్ గా మరియు మెంటల్ గా కూడా నిఖిల్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డట్లుగా టాక్ వినిపిస్తుంది. నిఖిల్ హీరోగా ఈ చిత్రంతో మరింత క్రేజ్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

అర్జున్ సురవరం విడుదలకు ముందే నిఖిల్ కు మంచి ఆఫర్ దక్కింది. గీతాఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించబోతున్న రెండు సినిమాల్లో నిఖిల్ హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే నిఖిల్ తో ఈ రెండు బ్యానర్ లు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో మొదటి సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఒక యువ దర్శకుడు ప్రస్తుతం కథను సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

నిఖిల్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైన్ చిత్రాలను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు బ్యానర్ లు సంయుక్తంగా ‘ప్రతి రోజు పండుగే’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది. గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా వరుసగా మీడియం బడ్జెట్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ లను దక్కించుకుంటున్నాయి. అందుకే నిఖిల్ తో కూడా రెండు ప్లాన్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. పూర్తి వివరాలు అర్జున్ సురవరం విడుదలైన తర్వాత వెళ్లడించే అవకాశం ఉందట.
Please Read Disclaimer