అరటి బోదె థై సొగసు..కన్నార్పగలరా?

0

థై సొగసుల తళాంగు తళుకుల సీజన్ ఇది. ఇన్ స్టా తెరిస్తే.. ట్విట్టర్ వెతికితే తొలిగా కనిపిస్తోంది అదే. కన్ను తిప్పలేరు. కునుకు వేయలేరు! అన్నట్టుగానే ఉందీ సీన్. ఇన్ స్టా సహా అన్ని మాధ్యమాల్లో స్టార్ హీరోయిన్ .. కుర్ర హీరోయిన్ అనే తేడా లేకుండా విజువల్ ఫెస్ట్ తో విరుచుకుపడుతున్నారు. నిరంతర ఫోటోషూట్లతో వేడెక్కించేస్తూ పబ్బం గడిపేస్తున్నారు. తమ పాపులారిటీని పెంచుకుని తద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు.

ఇప్పుడు ఈ రేస్ లోకి కోలీవుడ్ నటి కం మోడల్ నిమిష కూడా చేరింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాల్లో షేర్ చేసిన థై షో ఇట్టే వైరల్ అయిపోతోంది. అరటి బోదె అందంతో ఈ భామ టీనేజీ కుర్రాళ్ల కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిచ్చింది. టీనేజీ.. మిడిలేజీ.. లేట్ ఏజీ అనే తేడా ఏం లేదు. కళ్లార్పకుండా ఈ ట్రీట్ ని అందరూ ఆస్వాధించేస్తున్నారు మరి. ఇప్పటివరకూ నిమిష అంత పాపులరేమీ కాదు. ఇలా చేస్తూ ఉంటే ఇకపై పాపులర్ అయినట్టే. ఈ అందాన్ని చూశాక తెలుగు దర్శకనిర్మాతలు కూడా పిలిచి అవకాశం ఇచ్చేయడం ఖాయం. ముఖ్యంగా పూరి లాంటి డైరెక్టర్ కనీసం ఐటెమ్ భామగా అయినా ఫిక్స్ చేస్తాడేమో.

నిమిష ఇంతకుముందు పలు డీగ్లామరస్ రోల్స్ చేయడంతో అంతర్జాలంలో ఆ తరహా ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఆవిడేనా ఈవిడ? అన్నట్టుగా డౌట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే మరీ ఈ రేంజులో చెలరేగితే ఈ అమ్మడి స్పీడ్ కి అడ్డూ ఆపూ ఉండదనే అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ పలు ఆసక్తికర పాత్రల్లోనే నటించిందన్న టాక్ ఉంది. మలయాళం వదిలి కోలీవుడ్ ప్రవేశించిన ఈ బ్యూటీ స్టార్ డమ్ ఎలా ఉండనుందో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-