మెగా బ్రదర్ నే ఛీ కొట్టిన అమ్మాయిలు?

0

మెగా బ్రదర్ నాగబాబుని తొమ్మిది మంది అమ్మాయిలు ఛీ కొట్టారట. ఈ విషయాన్ని స్వయంగా మెగా బ్రదర్ నాగబాబు అంగీకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత కొంత కాలంగా ఈటీవీలో `జబర్దస్త్` కామెడీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చిన నాగబాబు సడన్ గా ఆ షో నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ అధినేత ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి షాకిచ్చారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా బయటికి వచ్చానని చెబుతున్నా రెమ్యునరేషన్ కారణంగానే బయటికి వచ్చారని ప్రచారం జరిగినా దాని పైనా నాగబాబు వివరణ ఇచ్చారు. పారితోషికం వంద శాతం కారణం కాదు.. వేరే కారణాలున్నాయని అన్నారు.

ఇక మెగా బ్రదర్ కొత్త జాబ్ గురించి తాజాగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల జీ టీవీ వారి `లోకల్ గ్యాంగ్స్` కామెడీ షోలో నాగబాబు ప్రత్యక్షం కావడంతో రకరకాల స్పెక్యులేషన్స్ ఊపందుకున్నాయి. ఇక లోకల్ గ్యాంగ్స్ లో నాగబాబు చెప్పిన కొన్ని సంగతులు అభిమానులకు షాకిచ్చాయి.

తనని ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలు చీ కొట్టారని చెప్పడం వైరల్ గా మారింది. అయితే తను వయసులో వుండగా తొమ్మిది మందిని ప్రేమించానని… అయితే అందు లో ఏ ఒక్కరూ తనని ఇష్ట పడలేదని తనదంతా వన్ సైడ్ లవ్ అని మెగాబ్రదర్ నాగబాబు సరదా సరదాగా చాలా సంగతుల్ని చెప్పుకొచ్చారు.
Please Read Disclaimer