ప్రేమలోకంలో యువజంట

0

యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అశ్వథ్థామ’ చిత్రంలో నటిస్తున్నాడు. సినిమాతో నూతన దర్శకుడు రమణ తేజ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను జనవరి 31 వ తేదీన విడుదల చేస్తామని ఈమధ్యే ప్రకటించారు. అంతే కాకుండా సినిమాకు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

ఈ సినిమానుండి ఫస్ట్ వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసేందుకు డేట్ టైమ్ ఖరారు చేశారు. నిన్నే నిన్నే అంటూ సాగే ఈ పాటను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని వెల్లడిస్తూ ఒక అందమైన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాగ శౌర్యకు జోడీగా మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో శౌర్య – మెహ్రీన్ లు ఇద్దరూ అప్పుడే ప్రేమలో పడ్డట్టుగా అదోరకం సంతోషంలో ఉన్నారు. మెహ్రీన్ వైట్ టాప్.. ప్రింటెడ్ లెహెంగా ధరించి క్యూట్ గా ఒక స్మైల్ ఇస్తోంది.. మెహ్రీన్ సిగ్గు గమనించినట్టుగా వెనకే ఉన్న శౌర్య ఓ చిరునవ్వు రువ్వుతున్నాడు. బ్రౌన్ – బ్లూ కాంబినేషన్లో ఉన్న షర్టు.. గడ్డం లుక్ లో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

‘అశ్వథ్థామ’ సినిమాకు ‘గూఢచారి’ ఫేమ్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ‘నిన్నే నిన్నే’ పాటకు ఎలాంటి ట్యూన్ అందించాడో తెలియాలంటే రేపటివరకూ వేచి చూడాలి. ‘అశ్వథ్థామ’ సినిమాను శౌర్య అమ్మగారు ఉష మూల్పూరి నిర్మిస్తుండగా నాన్నగారు శంకర్ ప్రసాద్ సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మూడవ చిత్రమిది.
Please Read Disclaimer