నిన్నే నిన్నే: స్వీటీ.. మ్యాడీ రొమాన్స్!

0

అనుష్క శెట్టి-ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో ‘నిశ్శబ్దం’ టీమ్ ‘ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా నుండి ‘నిన్నే నిన్నే’ అంటూ సాగే ఓ పాట వీడియో ప్రోమో ను విడుదల చేశారు.

ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకుడు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా సిడ్ శ్రీరామ్ ఆలపించారు. “నిన్నే నిన్నే కనులలో ఉన్నా.. నిన్నే నిన్నే మనసులో ఉన్నా అక్షరాలకే అందనంతలా ప్రేమలేఖలెన్నో.. చదువుకుంటే నీ మూగసైగలోనేలే” అంటూ లిరిక్స్ అందంగా సాగాయి. గోపి సుందర్ ఈ పాటకు రొమాంటిక్ ఫీల్ ఉండే ఒక ట్యూన్ అందించగా సిడ్ తన స్టైల్లో ఈ పాట ను మెలోడీ వాయిస్ తో పాడారు. వీడియో సాంగ్ ప్రోమో కాబట్టి విజువల్స్ బాగున్నాయి.

మోంటేజ్ సాంగ్ తరహాలో అమెరికాలోని అందమైన లొకేషన్లలో మాధవన్.. అనుష్క లవ్ బర్డ్స్ లాగా తిరుగుతూ కనిపించారు. ఓపెన్ టాప్ కార్ లో దూసుకుపోతూ ఉంటే అనుష్క నిలుచుని ఒక పెద్ద కర్చీఫ్ ను అలా గాలికి ఎగిరేలా పెట్టడం.. ఇద్దరూ వాక్ వే లో నడుస్తూ ఉంటే మాధవన్ తన భుజంతో అనుష్కను రొమాంటిక్ గా పక్కకు నెట్టడం లాంటి సీన్స్ ప్లెజెంట్ గా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు ఇలాంటి పాటలను వెంటనే చూసేయాలి.. చూసేయండి.
Please Read Disclaimer