స్టార్ హీరోయిన్ తమ్ముడు.. హీరోగా టాలీవుడ్లో నిలబడతాడా..?

0

అప్పట్లో కింగ్ నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్లో అదే టైటిల్‌తో మరో సినిమా రాబోతుంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను అంబికా ఆర్ట్స్.. ఈశ్వరి ఆర్ట్స్ బ్యానర్ల పై బొల్లినేని రమ్య వెలుగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వైకుంఠ బోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ పాట విడుదల చేశారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలోని రెండో లిరికల్ సాంగ్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. కొత్త పాట విడుదల చేసిన సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిత్రయూనిట్ కి విషెస్ చెప్పింది.

ఇక ఇంతకుముందే విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ పాటకు మంచి స్పందన రావడంతో.. తాజాగా విడుదల చేసిన రెండో లిరికల్ పాట పై కూడా మంచి హిట్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సఖుడా.. అంటూ సాగే ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా.. గాయని చిన్మయి ఆలపించింది. ఇక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘కింగ్ అక్కినేని నాగార్జునగారి సినిమా టైటిల్‌తో వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా చిత్ర టైటిల్‌ను కూడా ఆయనే విడుదల చేసి మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. సినిమాలోని అన్నీ పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. కానీ రకుల్ ప్రీత్ సింగే తన కెరీర్ ఈ మధ్య నెట్టుకు రాలేకపోతుంది. ఇంకా ఇంతమంది స్టార్ హీరోలు.. స్టార్ హీరోల వారసులు ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో అమన్ ఎలా సెటిల్ అవుతాడో చూడాలంటూ.. సినీ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి పాటలేనా సినిమా కూడా ఆకట్టుకుంటుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer