నిను వీడని నీడను నేనే ట్రైలర్ టాక్

0

సీరియస్ హారర్ సినిమాలు తగ్గిపోతున్న నేపథ్యంలో సరైన టైం వస్తున్న మూవీగా కనిపిస్తోంది నిను వీడని నీడను నేనే. సందీప్ కిషన్ హీరోగా అన్య సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఇందాకా విడుదలైంది. ఓ అబ్బాయి(సందీప్ కిషన్)ఓ అమ్మాయి(అన్య సింగ్) ప్రేమించుకుంటారు. అనుకోకుండా ఇద్దరూ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

అబ్బాయికి అద్దంలో తన బదులు మరో రూపం(వెన్నెల కిషోర్)కనిపిస్తుంది. ఇది ఎందుకో అర్థం కాక అందరు షాక్ కు గురవుతారు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్(పోసాని)కి ట్రీట్ చేస్తున్న డాక్టర్(మురళి శర్మ)కు ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఆరా తీస్తే కొత్తగా కనిపిస్తున్న రూపం వెనుక ఓ తీవ్రమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు తెలుస్తుంది. అసలు అతను ఎవరు ప్రేమ జంట జీవితంలోకి ఎందుకు వచ్చాడు అనేదే అసలు కథ

ప్రెజెంటేషన్ లో నావెల్టీ ఉంది. దర్శకుడు కార్తీక్ రాజు ఎంచుకున్న థీమ్ లో ఫ్రెష్ నెస్ ట్రైలర్ లోనే స్పష్టంగా కనిపిస్తోంది. కామెడీని టచ్ చేస్తూనే సీరియస్ హారర్ ని మంచి స్క్రీన్ ప్లేతో నడిపించిన ఫీలింగ్ కలుగుతోంది. దానికి మంచి బిజిఎంతో థమన్ తన మార్క్ చూపించడంతో ఇంటెన్సిటీ ఇంకో మెట్టు ఎక్కేసింది. పికె వర్మ సినిమాటోగ్రఫీ కూడా దీనికి బలంగా నిలిచింది.

బిగుతైన కథనంతో రూపొందినట్టు కనిపిస్తున్న నిను వీడని నేను నేనే కనక ట్రైలర్ లో చూపించిన కంటెంట్ పరంగా ప్రేక్షకులకు మంచి థ్రిల్స్ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది. వచ్చే నెల విడుదల కాబోతున్న ఈ మూవీకి హీరో సందీప్ కిషనే నిర్మాత కావడం విశేషం. దయా పన్నెం-విజి సుబ్రహ్మణ్యం ప్రొడక్షన్ పార్టనర్స్
Please Read Disclaimer