నిశ్శబ్ధం లుక్: షాలినిలో టెన్షన్ ఎందుకు?

0

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకుడు. కోనవెంకట్ రచయిత. ఆయనే నిర్మాత. కోన ఫిలింఫ్యాక్టరీ- పీపుల్స్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఆ టీజర్ లో అనుష్క.. అంజలి పాత్రల్ని ఎలివేట్ చేశారు.

అమెరికా సియాటిల్ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశమిది. థ్రిల్లర్ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అనుష్క మూగ యువతి అయిన చిత్రకారిణిగా నటిస్తున్నారు. మాధవన్ మ్యుజీషియన్ గా నటిస్తుండగా.. తెలుగమ్మాయ్ అంజలి సియాటిల్ పోలీస్ వింగ్ లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో కీలక పాత్ర లో నటిస్తున్న షాలిని పాండే లుక్ ని రిలీజ్ చేశారు. షాలిని ఈ మూవీలో సోనాలి అనే పాత్రలో కనిపించనున్నారు. ఓ మర్డర్ కేసులో సాక్షిగా కనిపించనుందా.. లేక ఆత్మ గా ఝలక్ ఇచ్చే పాత్రనా అన్నది తెలియాల్సి ఉంది. తాజాగా రివీల్ చేసిన పోస్టర్ చూస్తుంటే సోనాలి పాత్రలో ఎమోషన్ ఎక్కువగానే ఉంటుందని అర్థమవుతోంది. ఏదో టెన్షన్ అలుముకున్న సన్నివేశం ఇదని షాలిని లుక్ చూస్తుంటే అర్థమవుతోంది.
Please Read Disclaimer