స్వీటీ నిశ్శబ్ధంపై అదంతా ఉత్తుత్తి ప్రచారమేనా?

0

ఇన్నాళ్లు డిజిటల్ ని చిన్న చూపు చూసిన వాళ్లంతా ఇక లాభం లేదనుకుని ఏదో ఒకచోట రిలీజ్ చేసేయడమే ఉత్తమం అనుకునే పరిస్థితి వచ్చేసింది. మహమ్మారీ అంతకంతకు డిజిట్స్ పెంచుకుంటూ పోతుంటే ఒక్కొక్కరిలో దఢ పుడుతోంది. వైరస్ ఇప్పట్లో వదిలేట్టు లేదు. జనజీవనం తిరిగి యథావిధి స్థితికి రావడానికి చాలా కాలమే పడుతుందని సినీనిర్మాతలు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే తమ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు డిజిటల్ వేదికల్ని ఎంచుకుంటున్నారు. ఓటీటీలకు అమ్మకాలు సాగిస్తున్నారు.

ఇప్పటికే పలు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో రిలీజయ్యాయి. ఇంకో 20 సినిమాల వరకూ రిలీజ్ లకు రెడీగా ఉన్నాయి. వీళ్లంతా ఒక్కొక్కరుగా పట్టు సడలిస్తున్నట్టే కనిపిస్తోంది. కొందరు థియేట్రికల్ రిలీజ్ అన్న మాటెత్తకుండా ఓటీటీ రిలీజ్ కి బేరసారాలు సాగిస్తున్నారనే లీకులందుతున్నాయి. గత కొన్నిరోజులుగా అనుష్క నటించిన నిశ్శబ్ధం ఓటీటీలో రిలీజైపోతుంది అన్న ప్రచారం వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది నిజమా? అని ఆరా తీస్తే ఇంకా డీల్ పూర్తి కాలేదని తెలుస్తోంది.

అనుష్క నిశబ్ధం అమెజాన్ ప్రైమ్ లో రిలీజైపోతుందని ఇటీవల ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటివరకూ దీనిపై అమెజాన్ వాళ్లు ఎలాంటి సౌండ్ చేయకపోవడం షాకిస్తోంది. ఇక్కడ ప్రొడక్షన్ వాళ్లు మాత్రం త్వరలోనే ఓటిటి రిలీజ్ అయిపోతుందని రాంగ్ లీకులు ఇస్తున్నారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈ సినిమాను ఇంకా అమెజాన్ ప్రైమ్ హోల్డ్ లో ఉంచిందట. `పెంగ్విన్` దెబ్బకి అమోజాన్ వాళ్లు ఎంతో జాగ్రత్త పడుతున్నారట. కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా ఏదో సాధిస్తుంది అనుకుంటే సమీక్షకులు నెగెటివ్ రివ్యూలే ఇచ్చారు. ప్రేక్షకాదరణ అంతంత మాత్రమే. అందుకే అమెజాన్ వాళ్లు పునరాలోచిస్తున్నారట. ఇంకా నిశ్శబ్ధం సినిమాకి సంబంధించిన డైరెక్ట్ రిలీజ్ డీల్ సెట్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఫైల్ పరిశీలనలోనే ఉందన్నది తాజా లీక్.