యంగ్ హీరోతో మరోసారి జత కట్టనున్న ‘మహానటి’…?

0

టాలీవుడ్ యువ హీరో నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చేశాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ – కీర్తి సురేష్ లు తొలిసారి కలిసి నటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ లో నితిన్ – కీర్తి ప్రెష్ ఫెయిర్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా పై సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ – కీర్తి సురేష్ జంట సిల్వర్ స్క్రీన్ పై మరోసారి రొమాన్స్ చేయబోతున్నారట.

‘రంగ్ దే’ సినిమా తర్వాత బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అంధాదున్’ మూవీని నితిన్ తెలుగులో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ‘పవర్ పేట’ అనే సినిమాలో నితిన్ నటించనున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ మూడు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. కుర్రాడిగా.. మిడిల్ ఏజ్డ్ పర్సన్ లా.. ముసలి వాడిగా నితిన్ నటించబోతున్నట్లు గా సమాచారం. మూడు వయసుల పాత్రల్లో కనిపించాలి కనుక హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టును ఈ చిత్రం కోసం తీసుకున్నట్లు గా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నే తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇటీవల ‘రంగ్ దే’ రషెస్ చూసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య కీర్తి అయితేనే తన స్క్రిప్ట్ కి న్యాయం చేయగలదు అని డిసైడ్ అయ్యాడట. మరి ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి కీర్తి ఒప్పుకుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ‘పవర్ పేట’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభం అయ్యాయట. నితిన్ – కృష్ణ చైతన్య కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘చల్ మోహన్ రంగా’ సినిమా నిరాశ పరిచింది. మరి ఈసారి ఈ కాంబో ఎలాంటి రిజల్ట్ అందుకో బోతుందో చూడాలి.
Please Read Disclaimer