సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

వాటే బ్యూటీ పాట రివ్యూ : కిరాకు రాగం.. ఝకాస్ మేళం!

0

యువ హీరో నితిన్ తన కెరీర్లో కొంత గ్యాప్ తీసుకుని మరీ ప్రేక్షకులను మెప్పించడానికి ‘భీష్మ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈమధ్యే విడుదల చేసిన ‘వాటే బ్యూటీ’ పాట ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నితిన్.. రష్మిక మధ్య వర్క్ అవుట్ అయిన ఫిజిక్స్.. మాసు ట్యూను.. స్టెప్పులు వెంటనే అందరికీ కనెక్ట్ అయ్యాయి. ఇప్పటివరకూ ఈ పాట ప్రోమో వీడియోకు నలుగు మిలియన్ వ్యూస్ వచ్చాయంటే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ పాట లిరికల్ వీడియోను ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాతలు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రకటించారు. ఈ సందర్భంగా వాటే బ్యూటీ పాట ప్రోమోలో చూపించిన ఒక కిరాక్ స్టెప్ పోస్టర్ ను విడుదల చేశారు. తళుకుబెళుకులున్న దుస్తులు ధరించి ఒక గేర్ చక్రంలో సూపర్ స్టెప్ వేస్తూ ఉన్నారు. ఆ స్టెప్ వేస్తున్న సమయంలో రష్మిక స్మైల్.. వెనక నితిన్ స్టైల్ రెండూ అదిరిపోయాయి.. ఈరోజు విడుదల కానున్న లిరికల్ వీడియో కూడా సంచలనం సృష్టించడం ఖాయమే.

వాటే బ్యూటీ పాటకు సాహిత్యం అందించిన వారు కాసర్ల శ్యామ్. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాతో నితిన్ మంచి విజయాన్ని నమోదు చేస్తాడేమో వేచి చూడాలి.
Please Read Disclaimer