నితిన్ డ్రాప్ అయినట్టేనా?

0

కొన్ని రీమేక్ సినిమాల రైట్స్ ఎంతో ముచ్చట పడి తెచ్చుకుంటారు హీరోలు. అయితే నితిన్ కూడా ఈ మధ్య ఓ బాలీవుడ్ సినిమా ‘అంధదూన్’ రీమేక్ రైట్స్ ను అదే విధంగా అందిపుచ్చుకున్నాడు. అయుష్మాన్ ఖురాన్ నటించిన ‘అంధదూన్’ అనే సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిలీజైన వారానికే సినిమా కలెక్షన్స్ తో సత్తా చాటి అందరినీ ఆకర్షించింది. ఇటివలే ఈ సినిమాకు గానూ హీరో ఆయుష్మాన్ కి నేషనల్ అవార్డు కూడా అనౌన్స్ అయింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రీమేక్ నుండి హీరోగా నితిన్ డ్రాప్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. నితిన్ ఓ యంగ్ హీరోతో ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ హీరోగా నితిన్ మాత్రం డ్రాప్ అనే టాక్ గట్టిగానే వినబడుతుంది.

ఇక ఎంతో పోటీ మధ్య రీమేక్ రైట్స్ దక్కించుకొని తను చేయకుండా నితిన్ మరో హీరో చేతిలో సినిమాను పెడతాడని కూడా నమ్మలేం. ఇక ఈరీమక్ గురించి నితిన్ నుండి ప్రకటన వచ్చే వరకూ క్లారిటీ రాదు. మరి యూత్ స్టార్ ఈ సినిమా సంగతులు ఎప్పుడు చెప్తాడో ?
Please Read Disclaimer