‘భీష్మ’ డేట్ చెప్పేదెప్పడు?

0

డిసెంబర్ లో బడా సినిమాలతో పాటు కొన్ని మినిమం రేంజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్న సంగతి తెలియసిందే. ఇప్పటికే బాలయ్య ‘రూలర్’ – రవి తేజ ‘డిస్కో రాజా’ సాయి తేజ్ ‘ప్రతి రోజు పండగే’ సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి.

అయితే క్రిస్మస్ కానుకగా రిలీజ్ అంటూ అందరి కంటే ముందే డిసెంబర్లో రిలీజ్ లాక్ చేసుకున్న ‘భీష్మ’ మాత్రం ఇంత వరకూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఒకవైపు సినిమా ఫిబ్రవరి కి పోస్ట్ పోన్ అనే వార్తలొస్తున్నాయి మేకర్స్ నుండి ఉలుకూపలుకు లేదు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. ఓ పక్కా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

దీపావళి సందర్భంగా పోస్టర్ వదిలినా అందులో రిలీజ్ డేట్ మాత్రం మెన్షన్ చేయలేదు. ఇక సినిమా డిసెంబర్ కి రావడం పక్కనా లేదా అందరూ ఊహిస్తున్నట్టే ఫిబ్రవరి కి వెళ్లే ఛాన్స్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer