భీష్మకు పోటీ అన్నదే లేదా?

0

నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా `భీష్మ`. రష్మిక మందన- హెబ్బా పటేల్ కథానాయికలు. `ఛలో` ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. క్రిష్టమస్ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుందని తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్లాప్ తర్వాత నితిన్ బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తరుణమిది. అందుకే భీష్మపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం చక్కని లవ్ ఎంటర్ టైనర్. సినిమా ఆద్యంతం కామెడీ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. నితిన్ – వెన్నెల కిశోర్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఛలో తర్వాత మళ్లీ ఆ స్థాయి ఫీల్ గుడ్ సినిమాని అందించేందుకు వెంకీ ప్రయత్నిస్తున్నారట. ఆసక్తికరంగా ఈ చిత్రంలో హెబ్బా పోషించే పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఇకపోతే భీష్మ తప్ప.. క్రిస్మస్ సీజన్ లో వస్తున్నాం అని ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించలేదు కానీ.. ప్రస్తుత సన్నివేశం స్థబ్ధుగా ఉన్నా.. ప్రతి శుక్రవారం ఊహించని పోటీ బయటపడుతున్నట్టే క్రిస్మస్ సీజన్ లోనూ వార్ తప్పదని అర్థమవుతోంది. అప్పటికి శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న 96 రీమేక్ రిలీజ్ కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. యువహీరోల మధ్య రిలీజ్ తేదీల విషయమై నిర్మాతల గిల్డ్ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది కాబట్టి అప్పటికి ఎవరేం చేస్తారన్నది చూడాల్సి ఉంటుంది.
Please Read Disclaimer