మనసు మార్చుకున్న కుర్ర భీష్ముడు

0

యంగ్ హీరో నితిన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా రూపొందుతున్న భీష్మ ముందు అనుకున్న విడుదల డిసెంబర్ లో. కానీ విపరీతమైన పోటీ నెలకొంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేయబోతున్నట్టు తాజా అప్ డేట్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ తో మొదటి సినిమాకే అందరికి ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ కుడుముల దీనికి దర్శకుడు కావడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దానికి మించిన ఎంటర్ టైన్మెంట్ ఇందులో పొందుపరిచానని పదే పదే చెప్పడం అంచనాలు పెంచుతోంది.

సితార బ్యానర్ పై రూపొందుతున్న భీష్మ షూటింగ్ ఇప్పుడు ప్రోగ్రెస్ లో ఉంది. డిసెంబర్ డెడ్ లైన్ లేదు కాబట్టి ప్రమోషన్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ తదితర కార్యక్రమాలకు కావాల్సినంత టైం దొరకబోతోంది. ఛలో గత ఏడాది రిలీజయింది కూడా ఇలాంటి టైంలోనే. ఒకరకంగా వెంకీ కుడుముల దీన్ని సెంటిమెంట్ గా భావిస్తున్నాడు కాబోలు. నితిన్ కూడా రాజీ పడకుండా భీష్మా ను రూపొందాలనే పట్టుదలతో ఉన్నాడట. అనవసరమైన పోటీకి వెళ్లి ఓపెనింగ్స్ ని పోగొట్టుకోవడం వల్ల లాభం లేదని గుర్తించి ఫిబ్రవరిలో సోలో రిలీజ్ కు ఓటు వేశాడట.

నితిన్ సుమారు ఏడాది గ్యాప్ తర్వాత భీష్మ షూటింగ్ తోనే సెట్ లో అడుగు పెట్టాడు. అంతకు ముందు ఎన్నో అంచనాలతో చేసిన మూడు సినిమాలు లై – చల్ మోహనరంగా – శ్రీనివాస కళ్యాణం ఒకదాన్ని మించి మరొకటి ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో ఇప్పుడీ కుర్ర స్టార్ ఆశలన్నీ భీష్మ మీదే ఉన్నాయి. అందుకే హడావిడి లేకుండా కూల్ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. మంచి పనే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే చూడొచ్చు
Please Read Disclaimer