‘అంధాదున్’ రీమేక్ పై క్లారిటీ

0

ఇటివలే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘అంధాదున్’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న నితిన్ త్వరలోనే రీమేక్ ను సెట్స్ పై పెట్టబోతున్నాడు. ప్రస్తుతం ఈ రీమేక్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ రీమేక్ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ విషయాన్ని నితిన్ ప్రకటించాడు.

అయితే ఈ రీమేక్ చేయడానికి కొంచెం భయపడుతున్నానని చెప్పుకొచ్చాడు నితిన్. ఇటివలే ఆయుష్మాన్ కి ఆ సినిమాకు గానూ నేషనల్ అవార్డు వచ్చిందని అది భయం కలిగించిందని అన్నాడు. సమ్మర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలిపాడు. ఇక మూడు సినిమాలు ఒకే సారి చేయడం నరకం అంటూ చెప్పుకున్నాడు. ఇకపై ఒకే సారి మూడు సినిమాలు చేయనని తెలిపాడు.

ఇక తన ప్రేమ పెళ్లి గురించి డీటెయిల్స్ కూడా మీడియాతో పంచుకున్నాడు నితిన్. ఏప్రిల్ 15న ఎంగేజ్ మెంట్ ఏప్రిల్ 16 న దుబాయ్ లో పెళ్లి జరగుందని వచ్చాక ఏప్రిల్ 21న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుందని తెలిపాడు. తనకి పెళ్లి అవుతుండటం కొందరు హీరోలకి బాధ కలిగిస్తుంటే కొందరికి మాత్రం సంతోషంగా ఉందని. వెల్కం టూ అవర్ అంకుల్ గ్రూప్ అంటూ స్వాగతిస్తున్నారన్నాడు. ఇక తన ప్రేయసి కి ఇష్క్ సై సినిమాలంటే ఇష్టమని చెప్పాడు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-