నితిన్ అత్త-మామల ప్రేమకథ.. ఆదర్శ వివాహం?

0

నితిన్-షాలిని జంట పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈనెల 15న ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రీవెడ్డింగ్ వేడుక జరిగింది. ఏప్రిల్ 16న ఘనంగా దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అయితే ఇది ఆంధ్రా-తెలంగాణ అనుబంధం అంటూ ఓ ప్రచారం సాగింది. అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చా సాగింది. అయితే అది నిజమా? అని ఆరాతీస్తే.. చాలా డీప్ మ్యాటర్స్ తెలిసాయి.

షాలిని యూకే లో ఎంబీఏ చదువుకున్నారని.. వ్యాపార రంగంలో కెరీర్ పరంగా రాణిస్తున్నారని వివరాలు బయటకు తెలిసాయి. అయితే షాలిని కుటుంబానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. షాలిని తల్లిదండ్రులు కులమతాలకు అతీతంగా ప్రేమ వివాహం చేసుకున్నారని సమాచారం. షాలిని తండ్రి హిందువు కాగా…మదర్ ఓ ముస్లిమ్ అని తెలుస్తోంది. షాలిని తండ్రి పేరు సంపత్ కుమార్. ఆయన పేరున్న డాక్టర్. తల్లి పేరు నూర్ జహాన్. తనూ ఫేమస్ డాక్టర్ అని సమాచారం. వీరికి షాలిని రెండవ సంతానం. అయితే పెళ్లి తర్వాత పేరెంట్ హిందూ మతంలోకి మారారట. వీళ్లంతా నాగర్ కర్నూల్ లో కందనూలు లో నివసిస్తున్నారు. అక్కడే సొంతిల్లు.. కొన్ని వ్యాపారాలు ఉన్నట్లు తెలిసింది. అలాగే సంపత్ కుమార్ జిల్లా కేంద్రంలో రెండు దశాబ్ధాలుగా ప్రగతి నర్సింగ్ హోమ్ పేరిట ఓ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు.

నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న నితిన్ -షాలిని జంటకు పెద్దలు ఏనాడూ అడ్డు చెప్పలేదుట. ఈ విషయం ఇంట్లో ముందే తెలియజేసి ప్రేమాయణం సాగించారని తెలుస్తోంది. మొత్తానికి నితిన్ మామ హిందువు కాగా…అత్తమ్మ ఓ ముస్లీమ్ అన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమకు కులం మతంతో పని లేదు. మంచి మనసు ఉంటే చాలు అంటూ ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తుండడం విశేషం. ఇక నాగర్ కర్నూల్ తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. అంటే ఇది ఆంధ్రా – తెలంగాణ బాండింగ్ కాదు.. లోకల్ తెలంగాణ బాండింగ్ అని తేలింది. ప్రస్తుతం నితిన్ నటించిన భీష్మ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-