ఆషాడం అవ్వగానే కళ్యాణం

0

యంగ్ హీరో నితిన్ 2018 సంవత్సరంలో శ్రీనివాస కళ్యాణం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో పెళ్లి కొడుకుగా మారిన నితిన్ రియల్ లైఫ్ లో కూడా పెళ్లి కొడుకుగా అయ్యేందుకు సిద్దం అయ్యాడు. సుదీర్ఘ కాలంగా శాలినిని ప్రేమిస్తున్న నితిన్ మొన్నటి ఏప్రిల్ నెలలో పెళ్లికి సిద్దం అయ్యాడు. దుబాయిలో భారీగా డెస్టినేషన్ మ్యారేజ్ కు నాలుగు నెలల ముందే ప్లాన్ చేశారు. కాని మహమ్మారి వైరస్ తో అంతా రివర్స్ అయ్యింది.

మార్చిలో నితిన్ వివాహంను వాయిదా వేస్తున్నామని.. పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత అంటే ఈ ఏడాది చివరిల్లో మళ్లీ దుబాయిలోనే డెస్టినేషన్ మ్యారేజ్ జరిపిస్తామంటూ ఇరు కుటుంబాలు ప్రకటించాయి. అయితే పరిస్థితులు ఇప్పట్లో కుదుట పడే పరిస్థితులు కనిపించడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేయడం కరెక్ట్ కాదనే నిర్ణయానికి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఆషాడమాసం నడుస్తోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాడంలో పెళ్లిలు జరిపించరు. ఆషాడం తర్వాత శ్రావణ మాసం లేదా కార్తీక మాసంలో పెళ్లిలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నితిన్ పెళ్లిని ఆషాడం పూర్తి అయిన వెంటనే జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో పెళ్లికి సిద్దం అవుతున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రులను ఈ పెళ్లికి నితిన్ అండ్ ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నితిన్ షాలినిల వివాహం జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer