చదరంగం ఆడుతున్న నితిన్

0

ఎన్ని ప్లాప్స్ వచ్చినా ఎక్కడా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఒకేఒక్క తెలుగు హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ హీరోగా మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఒకటి భీష్మ – రెండవది రంగ్ దే. మూడవ సినిమా చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో చేస్తున్నాడు.

ఈ సినిమాకి ‘చదరంగం’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. సినిమాలో నితిన్ కి – చెస్ గేమ్ కి సంబంధం ఉంటుందని అందుకే ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని అనుకుంటున్నారు. టైటిల్ వింటే ఇదేదో ఫ్యామిలీ స్టోరీలా ఉంటుందని – కానీ ఈ సినిమాలో క్రైమ్ – థ్రిల్లర్ తో పాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి సినిమాలంటే స్క్రీన్ ప్లే హైలైట్ ఉంటుందని అందరికీ తెలిసిందే. రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా తాను చంద్ర శేఖర్ యేలేటిని చూసి స్క్రీన్ ప్లే అంటే ఏంటో నేర్చుకున్నానని అన్నారు. చదరంగం ఆటలోనే ఒక ఇంటెలిజెన్స్ ఉంటది. అలాంటి స్క్రిప్ట్ చంద్ర శేఖర్ యేలేటి లాంటి డైరెక్టర్ డీల్ చేస్తున్నాడంటే సినిమా మీద అంచనాలు పెరగడం ఖాయం.
Please Read Disclaimer