‘ఛలో’ సెంటిమెంట్ తో భీష్మ ?

0

నితిన్ నుండి సినిమా వచ్చి ఏడాదైంది. ‘శ్రీనివాస కళ్యాణం’ సరిగ్గా గతేడాది ఆగస్ట్ లో విడుదలైంది. అప్పటి నుండి ఇంత వరకూ నితిన్ సినిమా రాలేదు. మధ్యలో కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో ముందుగా వెంకీ కుడుములకి అవకాశం ఇచ్చాడు. కానీ సినిమా అనౌన్స్ మెంట్ కే చాలా టైం పట్టింది. అనౌన్స్ చేసాక కూడా సెట్స్ పైకి రావడానికి ఇంకొంత టైం తీసుకున్నాడు నితిన్. ఎట్టకేలకు ‘భీష్మ’ షూట్ మొదలైంది.

‘భీష్మ’ ను ముందుగా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు అది మేకర్స్ కి అంత ఈజీగా కనిపించడం లేదు. ఇంత వరకూ షూటింగ్ నలభై శాతమే జరిగిందట. అంటే ఈ ఏడాదికి ‘భీష్మ’తో నితిన్ ప్రేక్షకులను పలకరించడం అనేది జరగదు. ఇక వచ్చే ఏడాది జనవరిలో వరుసగా బడా సినిమాలున్నాయి. అందుకే ఇప్పుడు మేకర్స్ ఫివ్రవరిలో రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారట. వెంకీ కుడుములు మొదటి సినిమా ‘ఛలో’ గతేడాది ఫిబ్రవరి 2న విడుదలైంది. ఇపుడు అదే సెంటిమెంట్ తో ‘భీష్మ’ ను కూడా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

‘భీష్మ’ తర్వాత వెంకీ అట్లూరి తో ‘రంగ్ దే’ సినిమా చేయనున్నాడు నితిన్. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఆ తరువాత చంద్ర శేఖర్ యేలేటి కృష్ణ చైతన్య లతో సినిమాలు చేస్తాడు. సో ఈ ఏడాది మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ మాత్రం నితిన్ నుండి రెండు సినిమాలు మాత్రం కన్ఫర్మ్.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home