బాబోయ్ నితిన్ పెద్ద రిస్కే చేయబోతున్నాడుగా!

0

రేపు భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్ ఆ వెంటనే మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. వెంకీ అట్లూరి మరియు చంద్రశేఖర్ యేలేటి చిత్రాల్లో ప్రస్తుతం నితిన్ చేస్తున్నాడు. ఆ చిత్రాలు మాత్రమే కాకుండా ‘పవర్ పేట’ అనే చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థలో రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేయబోతున్నాడు. చాలా కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు మొదలు అయ్యాయి. కాని ఏవో కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోంది.

భీష్మ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ పేట సినిమాకు సంబంధించిన వివరాలు చెప్పుకొచ్చాడు. కథ ఇప్పటికే సిద్దం అయ్యింది. అయితే కథ రీత్యా దాన్ని రెండు మూడు పార్ట్ లుగా చేయాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో కూడుకున్నది అవ్వడంతో పాటు నేను ఈ కథ కోసం 18 ఏళ్లు.. 40 ఏళ్లు.. 60 ఏళ్ల వయసు వ్యక్తిగా కనిపించాల్సి ఉంటుంది. అందుకోసం కూడా చాలా వర్కౌట్స్ జరుగుతున్నాయని అన్నాడు.

నితిన్ వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో గతంలో నితిన్ చల్ మోహన్ రంగ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చింది. అయినా కూడా మరోసారి ఆయన చెప్పిన కథపై నమ్మకంతో నితిన్ పవర్ పేట సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. నితిన్ మాటలతో పవర్ పేట సినిమాపై చాలా ఆసక్తి కలుగుతోంది. కథ 1960 నుండి 2020 వరకు సాగుతుందట. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-