ప్రేమలోనే ఎన్ని గొడవలు పడ్డారో చెప్పేశాడు

0

సినిమాల్లో హీరో అన్నంతనే ప్రేమలో పడటం.. ఒకటి కావటం సహజం. రీల్ కు రియల్ కు మధ్య తేడా ఎంతన్నది టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల రియల్ లైఫుల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రీల్ లో తెగ ప్రేమను పండించే హీరోలు.. వాస్తవంలో మాత్రం పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు చేసుకునే వారే ఎక్కువ. అప్పుడప్పుడు ఒక అల్లుఅర్జున్.. ఒక నితిన్ లాంటోళ్లు మినహాయింపుగా చెప్పాలి.

సినిమా బ్యాక్ గ్రౌండ్ కు ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయి ప్రేమలో పడిన నితిన్.. తమ ఎనిమిదేళ్ల లవ్ స్టోరీని ఏప్రిల్ 16తో పెళ్లి అనే మరో స్టేజ్ కి తీసుకెళుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు గుట్టుగా ఉంచిన ప్రేమ విషయాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ వివరాలు.. విశేషాల్ని చెబుతున్నాడు. ప్రేమ ఎంత రహస్యమో.. పెళ్లి అంత పబ్లిక్ అన్నది ఎంత వాస్తవమో నితిన్ మాటల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ లవ్ ట్రాక్ గురించిన ఆసక్తికర అంశాల్ని పంచుకున్నాడు. ప్రేమ అన్నంతనే కేవలం స్వీట్ నథింగ్స్ మాత్రమే కాదన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారు. ప్రతి మనిషిలో ప్లస్సులు.. మైనస్సులు కామన్ అని.. ఇద్దరిలోనూ కొన్ని తేడాలు ఉండటం మామూలే అన్న విషయాన్ని చెప్పిన నితిన్.. ఎనిమిదేళ్ల ప్రేమలో పలుమార్లు గొడవ పడిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

గొడవ పడటం.. మాట్లాడుకోకుండా ఉండటం లాంటివి జరిగాయని.. తను కొంచెం మారితే.. తాను కూడా కొంచెం మారిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఎవరూ పర్ ఫెక్టుగా ఉండరని… లోపాలు సహజమని చెబుతున్న నితన్ తీరు చూస్తే.. పెళ్లికి ముందే లైఫ్ మీద ఫుల్ క్లారిటీకి వచ్చేసినట్లుగా కనిపించక మానదు.
Please Read Disclaimer