సంతోష్ ఛాలెంజ్ కు రియాక్ట్ అయిన నితిన్!

0

ప్రస్తుతం తెలంగాణలో పలు ఛాలెంజ్ లు నడుస్తున్నాయి. ఇప్పుడున్న వాటిల్లో ట్రెండింగ్ గా నడుస్తోంది గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్బంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతోంది. నిన్నటికి నిన్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ రియాక్ట్ అవుతూ.. తన ఎంపీ లాడ్స్ నుంచి అటవీ పెంపకానికి నిధులు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు. పనిలో పనిగా ఈ ఛాలెంజ్ ను పలువురు సినీ.. రాజకీయ ప్రముఖులకు సవాల్ విసిరారు.

సంతోష్ సవాల్ విసిరిన వారిలో సినీ నటుడు నితిన్ ఒకరు. తాజాగా సంతోష్ ఛాలెంజ్ కు నితిన్ స్పందించారు. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ ఒక చక్కటి కార్యక్రమంగా అభివర్ణించిన ఆయన.. తనను ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. బాధ్యతల్ని గుర్తు చేసే ఏ ఛాలెంజ్ ను అయినా తాను స్పందిస్తానన్నారు.

మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తయారు చేసేందుకు తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తానని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరిని నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేటీఆర్ కు బర్త్ డే చెప్పిన ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
Please Read Disclaimer