‘పవర్ పేట’ స్పీడ్ పెంచిన యంగ్ స్టార్

0

నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా అవ్వడంతో పాటు ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఈ చిత్రంలో నితిన్ మూడు వయసుల వాడిగా కనిపించబోతున్నాడు. కుర్రాడిగా మద్య వయస్కుడిగా ముసలి వాడిగా నితిన్ నటించబోతున్నట్లుగా ఇప్పటికే హింట్ వచ్చేసింది. ప్రస్తుతం చేస్తున్న రంగ్ దే చిత్రం ఇంకా అంధాదున్ రీమేక్ లు పూర్తి అయిన వెంటనే పవర్ పేట మొదలు పెట్టబోతున్నారు.ఇన్ని రోజులు చర్చల దశలోనే ఉన్న పవర్ పేట మెల్ల మెల్లగా స్పీడ్ పెంచారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో నితిన్ మేకప్ చాలా విభిన్నంగా ఉండాలి. మూడు వయసుల పాత్రల్లో కనిపించాలి కనుక హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టును ఈ చిత్రం కోసం తీసుకున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నదియాను సంప్రదించారట. స్టోరీ లైన్ విన్న ఆమె పవర్ పేట చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.తెలుగు మరియు తమిళంలో ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న నదియా పవర్ పేటకు మరింత ఆకర్షణ తీసుకు వస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నదియాకు అడ్వాన్స్ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి.

అత్తారింటికి దారేది చిత్రంలో చాలా హుందా పాత్రలో నటించి మెప్పించిన నదియా ఆ తర్వాత తెలుగులో చాలా చిత్రాల్లోనే నటించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈమెకు మరో భారీ ఆఫర్ నితిన్ రూపంలో వచ్చినట్లుగా అనుకుంటున్నారు.
Please Read Disclaimer