కుర్రహీరో చేతికి కళ్ళు లేని సినిమా?

0

గత ఏడాది బాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసుకున్న అంధాదున్ ఎట్టకేలకు తెలుగులో రాబోతోందని సమాచారం. ఇప్పటికే రీమేక్ రైట్స్ కోసం విపరీతంగా పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫైనల్ గా ఇవి నితిన్ చేతికి వెళ్లినట్టుగా తెలిసింది. తండ్రి సుధాకర్ రెడ్డి తో పాటు ఒరిజినల్ వెర్షన్ నిర్మాత వయాకామ్ 18 నిర్మాణ భాగస్వామిగా ఉండబోతోంది. ఆయుష్మాన్ ఖురానా కళ్ళు లేని వాడిగా అద్భుతంగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.

దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ క్రిటిక్స్ తో సైతం శభాష్ అనిపించుకుంది. ఏషియన్ ఫిలిమ్స్ తో పాటు అభిషేక్ పిక్చర్స్ పోటీ పడగా కోనేరు సత్యనారాయణ కూడా హక్కుల కోసం గట్టిగా ట్రై చేశారట. ఫైనల్ గా ఇవి నితిన్ నాన్న చేతికి వచ్చాయి. నితిన్ ప్రస్తుతం భీష్మ-రంగ్ దే లతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్తయ్యి విడుదలయ్యే సరికి వచ్చే ఏడాది సంక్రాంతి దాటేస్తుంది.

ఆ తర్వాతే రీమేక్ పనులు మొదలవ్వొచ్చు. దర్శకుడు టెక్నికల్ టీమ్ తదితరాలు ఫైనల్ కావడానికి టైం పట్టొచ్చు. హిందీలో హీరోయిన్ గా రాధికా ఆప్టే నటించగా సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వీటిని తెలుగులో ఎవరు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మరో మంచి థ్రిల్లర్ తెలుగులో రీమేక్ కానుండటం సంతోషించాల్సిన విషయమే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడొచ్చుPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home