బుల్లెమ్మ.. బాలయ్య!

0

నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే పలు సెలబ్రిటీల పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ వారు మహానటి సావిత్రి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అంటే అచ్చంగా సావిత్రి పోస్టర్ కాదు గానీ గుండమ్మ కథ సినిమాలోని ఎన్టీఆర్ – సావిత్రి కాంబినేషన్ స్టిల్ రిలీజ్ చేశారు.

సావిత్రి పాత్రలో నిత్య మేనన్ తళుక్కున మెరవడం విశేషం. ‘గుండమ్మకథ’ సినిమాలోని ‘లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం’ పాట పాడుతూ ఎన్టీఆర్ పెద్ద రోట్లో ఎడమచేత్తో పప్పు రుబ్బుతాడు కదా. కరెక్ట్ గా అదే సీన్. పెద్దాయన పాత్రలో మొరటోడిలా బాలయ్య బాబు ఉత్సాహంగా రుబ్బుతూ పాటేసుకుంటే.. పక్కనే అణకువగా బుల్లెమ్మ సావిత్రి పాత్రలో నిత్య మేనన్ అలా నిలబడి ఉంది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ టీం నుండి రిలీజ్ అయిన బెస్ట్ పోస్టర్లలో ఇదొకటి. చూడగానే మిమ్మల్ని గుండమ్మ కథలోకి తీసుకెళ్తుంది. బాలయ్య బాబు పూర్తిగా నాన్నగారిలా మారిపోయాడు. ఆయన గురించి మాట్లాడే ధైర్యం మాకు లేదు.

ఇక కీర్తి సురేష్ ని తప్ప వేరొకరు సావిత్రి పాత్రలో నటిస్తే ఊహించుకోలేం అన్నట్టుగా ‘మహానటి’ మ్యాజిక్ చేసింది. కానీ ఓపెన్ మైండ్ తో చూస్తే మాత్రం నిత్య మేనన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపిస్తోంది. పైగా నిత్యా బొద్దుగా ఉండడం వల్ల సావిత్రమ్మ ను చూసినట్టే ఉంది. మీరు కొత్త బుల్లెమ్మ ను చూడండి.. వీలైతే ‘లేచింది.. నిద్ర లేచింది’ పాటేసుకోండి.
Please Read Disclaimer