మరోలా ఎంటర్ టైన్ చేసేందుకు నిత్యా సిద్దం

0

అలా మొదలైంది అంటూ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయిన ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంది. మామూలుగా అయితే తెలుగు రాని హీరోయిన్స్ కు మరెవ్వరైనా డబ్బింగ్ చెప్తారు. కాని నిత్యామీనన్ అలా మొదలైంది చిత్రంలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఆ విషయమే చాలా పెద్దది అనుకుంటే మొదటి సినిమాలోనే పాట అది కూడా తెలుగు పాట పాడటం అనేది చాలా చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు.

నటిగానే కాకుండా మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకునేలా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ప్రావిణ్యం సంపాదించిన నిత్యామీనన్ సింగర్ గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అయ్యింది. సింగర్ గా నిత్యామీనన్ తన మొదటి ఆల్బమ్ ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. ఆ విషయాన్ని స్వయంగా నిత్యామీనన్ ప్రకటించింది. నా మొదటి మ్యూజిక్ ఆల్బంను మీ ముందుకు తీసుకు వస్తున్నాను అంటూ అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

ఈ అమ్మడి మ్యూజిక్ ఆల్బమ్ కు లండన్ కు చెందిన ఒక మ్యుజీషియన్ సంగీతంను సమకూర్చినట్లుగా తెలుస్తోంది. నిత్యా మీనన్ ఇప్పటి వరకు హీరోయిన్ గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. హీరోయిన్ గా కాస్త అవకాశాలు తగ్గడంతో ఇలా మ్యూజిక్ ఆల్బంలను మొదలు పెట్టడం మంచి ఆలోచన అంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా సక్సెస్ అయినట్లుగానే మ్యూజిక్ ఆల్బమ్ స్టార్ గా కూడా నిత్యా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
Please Read Disclaimer